Posts

Library

27 years old vikaram stepped down from bike and entered into library. విక్రమ్ లైబ్రరి లోకి వెళ్ళేసరికి అక్కడ ఒక అమ్మాయి మాత్రమే ఉంది. విక్రమ్ పట్టించుకోకుండా తన బుక్స్ తీసి చదువుతున్నాడు.  ఆ అమ్మాయి విక్రమ్ వంక చూసింది.  విక్రమ్ ఆమెని పట్టించుకోలేదు . తన బుక్స్ లో విక్రమ్ నిమగ్నమయ్యాడు. ఆమె మనసులో ఇతనికి బలుపు చాలా ఉందని అనుకుంది.  ఆమె వెళ్లబోతు లైట్ ఫ్యాన్ ఆపి వెళ్ళమని చెప్పింది. విక్రమ్ తల పైకి ఎత్తి చూసి ఓకే అన్నట్లు చూసి ఫోన్ కేసి చూశాడు. ఆమె కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఆమె వచ్చేసరికి అతను అక్కడే ఉన్నాడు. ఆమె కూడా పట్టించుకోకుండా ఆమె బుక్స్ లో నిమగ్నమైంది .  ఇలా కొన్ని రోజులు జరిగినది. ఒక రోజు ఆమె విక్రమ్ దగ్గరికి వెళ్ళి hi అనింది. అతను కూడా hi అని చెప్పి ఐ యమ్ విక్రమ్ అన్నాడు. ఆమె ఐ యమ్ పల్లవి అని పరిచయం చేసుకుంది.